ఫ్లాప్ డైరెక్టర్ తో శర్వానంద్
TOLLYWOOD
 TOPSTORY

ఫ్లాప్ డైరెక్టర్ తో శర్వానంద్

Murali R | Published:November 22, 2017, 3:58 PM IST

ఇటీవలే నితిన్ తో లై అనే ఘోర పరాజయం పొందిన చిత్రాన్ని అందించిన దర్శకులు హను రాఘవాపుడి , కాగా అతడితో జత కడుతున్నాడు వరుస హిట్స్ అందుకుంటున్న హీరో శర్వానంద్ . ఇటీవలే మహానుభావుడు చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు శర్వానంద్ . గత మూడున్నర సంవత్సరాలుగా శర్వానంద్ వరుసగా విజయాలు సాధిస్తున్నాడు పైగా అగ్ర హీరోలతో పోటీపడి కూడా విజయాలను అందుకుంటున్నాడు.

దాంతో అతడిపై అంచనాలు పెరిగాయి కట్ చేస్తే లై వంటి డిజాస్టర్ ఇచ్చిన హను రాఘవాపుడి దర్శకత్వంలో నటించడానికి రెడీ అయ్యాడు శర్వ . రేపు ఈ కొత్త సినిమా ప్రారంభం కానుంది . హను మంచి దర్శకుడే అయినప్పటికీ ఇక్కడ సక్సెస్ మాత్రమే చూస్తారు కానీ శర్వా మాత్రం ఫ్లాప్ డైరెక్టర్ కు చాన్స్ ఇవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు . హిట్ అయితే శర్వా ని అభినందిస్తారు లేదంటే నిందించడం ఖాయం.
Comments

FOLLOW
 TOLLYWOOD