ఓంపురి చనిపోయేముందురోజు ఏం జరిగిందో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

ఓంపురి చనిపోయేముందురోజు ఏం జరిగిందో తెలుసా

Thursday January 12th 2017

బాలీవుడ్ దిగ్గజం ఓంపురి మృతి పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . 66 ఏళ్ల ఓంపురి ఈనెల 6న తెల్లవారు జామున చనిపోయిన విషయం తెలిసిందే . అయితే చనిపోయే ముందు రోజు ఏం జరిగిందో తెలుసా ....... భార్య తో పెద్ద గొడవే జరిగిందట . ఈమె మాజీ భార్య కావడం గమనార్హం . తన కొడుకు అయిన ఇషాన్ ని కలుసుకునేందుకు త్రిశూల్ బిల్డింగ్ కు వెళ్ళాడట ఓంపురి అయితే ఓంపురి వెంట డ్రైవర్ కం ఫ్రెండ్ ఖాలిద్ కిద్వావ్ కూడా ఉన్నాడట . 

అతడు చెప్పిన వివరాల ప్రకారం కొడుకు కోసం వెళితే అక్కడ కొడుకు లేడు అలాగే మాజీ భార్య నందిత కూడా లేదు దాంతో నందితకు ఫోన్ చేసి వెంటనే అబ్బాయి ని తీసుకొని ఇంటికి రమ్మని చెప్పాడట అయితే ఇద్దరి మధ్య ఫోన్ లో పెద్ద గొడవే జరిగిందట . గంటసేపు ఎదురు చూసినప్పటికీ వాళ్ళు రాకపోవడంతో కారులో కూర్చొని మద్యం సేవించి అక్కడి నుండి వెళ్ళిపోయాడట కట్ చేస్తే ఉదయమే ఓంపురి మరణవార్త వినాల్సి వచ్చిందని పోలీసులకు సమాచారం అందించాడు ఓంపురి స్నేహితుడు దాంతో ఆ దిశగా కేసుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . Comments

FOLLOW
 TOLLYWOOD