40 కోట్ల రెమ్యునరేషనా పవన్ కళ్యాణ్ కు
TOLLYWOOD
 TOPSTORY

40 కోట్ల రెమ్యునరేషనా పవన్ కళ్యాణ్ కు

Murali R | Published:November 13, 2017, 8:39 PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంట పండుతోంది , జనసేన పుణ్యమా అని పవన్ కళ్యాణ్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . 2019 లో శాసనసభ కు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి లో రాజకీయాల పై దృష్టి పెట్టడానికి సమాయత్తం అవుతున్నాడు అయితే పవన్ కళ్యాణ్ తెలుగునాట తిరుగులేని స్టార్ హీరో కాబట్టి అతడితో సినిమాలు చేయాలనీ పలువురు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం అంతటి సమయం లేదు కాబట్టి సినిమాలకు గుడ్ బై చెప్పడానికి నిర్ణయం తీసుకున్నాడట.

దాంతో  సినిమా చేయండి కావాలంటే సినిమాకు 40 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని స్పష్టం చేశారట మైత్రి మూవీస్ సంస్థ . నలభై కోట్ల రెమ్యునరేషన్ అంటే మాటలు కాదు దక్షిణాదిన మాత్రమే కాదు భారత్ మొత్తంలో ఇంతటి సొమ్ము తీసుకుంటున్న హీరో ఒక్క రజనీకాంత్ మాత్రమే ! మిగతా హీరోలకు ఆ స్థాయి రెమ్యునరేషన్ లేదు కానీ పవన్ కళ్యాణ్ కు అంతటి సొమ్ము ఇవ్వడానికి ముందుకు వచ్చారంటే పవన్ ఓకే చెబుతాడేమో చూడాలి ఎందుకంటే ఎన్నికల్లో డబ్బులు కావాలి కదా మరి.Comments

FOLLOW
 TOLLYWOOD