శాటిలైట్ రైట్స్ లో సంచలనం పవన్ కళ్యాణ్ సినిమా
TOLLYWOOD
 TOPSTORY

శాటిలైట్ రైట్స్ లో సంచలనం పవన్ కళ్యాణ్ సినిమా

Murali R | Published:November 13, 2017, 12:51 PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ చిత్ర శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకోవడానికి మూడు చానళ్ళు పోటీ పడ్డాయి అయితే అందులో జెమిని టివి అత్యధిక రేటు ఇచ్చి పవన్ కళ్యాణ్ చిత్రాన్ని సొంతం చేసుకుంది దాంతో ఇప్పుడు ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది . ఇంకా పేరు నిర్ణయించలేదు కానీ అజ్ఞాత వాసి అనే టైటిల్ అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు . ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులకు రేటు ఎంత పలికిందో తెలుసా ....... 19 కోట్ల యాభై లక్షలు . 
 
 
 
స్టార్ మాటివి 14 లేదా 15 కోట్ల కు తీసుకోవడానికి ముందుకు వచ్చింది అయితే నిర్మాత దానికి ఒప్పుకోలేదు , ఇక జీ తెలుగు ఛానల్ వాళ్ళు 16 కోట్ల వరకు రేటు పలికారట ! దానికి కూడా అతడు ఒప్పుకోలేదు దాంతో రంగంలోకి దిగిన జెమిని టివి ఫైనల్ గా 19 . 50 కోట్లకు శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకుంది . పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్ , అను ఇమ్మాన్యుయేల్ నటించగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు . ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది  జనవరి 10న రిలీజ్ కానుంది . Comments

FOLLOW
 TOLLYWOOD