కేశవకు రన్ టైం కలిసి వస్తుందా
TOLLYWOOD
 TOPSTORY

కేశవకు రన్ టైం కలిసి వస్తుందా

Murali R | Published:May 19, 2017, 12:00 AM IST
నిఖిల్ వరుస విజయాలతో మంచి జోరు మీదున్నాడు . తాజాగా కేశవ సినిమా రిలీజ్ అయ్యింది , ఈ సినిమాపై నిఖిల్ భారీ గానే ఆశలు పెట్టుకున్నాడు . సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది . ప్రశాంతంగా ప్రతీకారం తీర్చుకునే విభిన్నమైన పాత్ర ని నిఖిల్ పోషిస్తున్నాడు . ఎప్పటికప్పుడు విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్ సాధిస్తున్న నిఖిల్ ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నాడు .
 
 

ఇక కేశవ రన్ టైం ఎంతో తెలుసా ........ రెండు గంటల లోపే సుమా ! చాలా తక్కువ రన్ టైం ఉంది కాబట్టి తప్పకుండా సినిమాకు మంచి హెల్ప్ అవుతుంది . టీజర్ , ట్రైలర్ తో కేశవపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి . దాంతో ఈ సినిమా విజయం పై ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . రీతూ వర్మ హీరోయిన్ గా నటించిన కేశవపై రీతూ కూడా ఆశలు పెట్టుకుంది . పెళ్లి చూపులు తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి .
Comments

FOLLOW
 TOLLYWOOD