రహస్య వివాహం చేసుకోలేదట
TOLLYWOOD
 TOPSTORY

రహస్య వివాహం చేసుకోలేదట

Murali R | Published:September 6, 2017, 12:00 AM IST
నేను రహస్య వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో అదేపనిగా ప్రచారం చేస్తున్నారని , అదంతా తప్పుడు ప్రచారమని నాకు ఇంకా పెళ్లి కాలేదు పైగా రహస్య వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదని ఆవేశంగా చెబుతోంది కన్నడ భామ '' శృతి హరిహరన్ ''. కేరళ  డ్యాన్స్ మాస్టర్ ని శృతి హరిహరన్ రహస్య వివాహం చేసుకుంది అని గతకొంతకాలంగా సోషల్ మీడియాలో అదేపని గా ప్రచారం చేస్తున్నారు . ఆ ప్రచారం మరీ ఎక్కువయి శృతి చెవిన పడటంతో నిన్న మీడియా ముందుకు వచ్చి రహస్య వివాహం ఆరోపణలను ఖండించింది .
 
 

నాకు చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి , వాటితోనే నాకు సమయం సరిపోవడం లేదు అలాగే ఇతర బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి వాటన్నింటిని పక్కన పెట్టి పెళ్లి ఎలా చేసుకోగలను అంతేకాదు అసలు పెళ్లి చేసుకునే ముందు మీ అందరినీ పిలిచి మరీ పెళ్లి చేసుకుంటాను తప్ప సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం నాకు పట్టలేదు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది శృతి హరిహరన్ . 
Comments

FOLLOW
 TOLLYWOOD