హీరో సిద్దార్థ్ తప్పు చేస్తున్నాడా
TOLLYWOOD
 TOPSTORY

హీరో సిద్దార్థ్ తప్పు చేస్తున్నాడా

Murali R | Published:October 26, 2017, 2:53 PM IST
తెలుగులో హీరోగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో సిద్దార్థ్ కానీ గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక , అలాగే ప్రేమలో కూడా విఫలమై కెరీర్ పరంగా ఎటూ తేల్చుకోలేక సతమతం అయ్యాడు కట్ చేస్తే ఇప్పుడు గృహం అనే హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . హర్రర్ చిత్రాలు విజయాలు సాధిస్తుండటంతో ఆ జోనర్ లో సినిమా చేసాడు , అంతా బాగానే ఉంది కానీ ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా ఏకంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి పడేసారు . సిద్దార్థ్ స్టార్ హీరో కాదు , అలాగే వరుస విజయాలు సాధిస్తున్న హీరో కూడా కాదు అసలు చెప్పాలంటే కొంతకాలంగా సరైన సక్సెస్ లేదు , సరైన సినిమాలు కూడా చేయలేదు . 
 
 
అలాంటిది ఈ గృహం సినిమా ప్రమోషన్ బాగా చేసి అప్పుడు రిలీజ్ చేయాల్సి ఉండే , కానీ నవంబర్ 3న మా గృహం చిత్రం రిలీజ్ అంటూ డేట్ ప్రకటించారు . విచిత్రం ఏంటంటే అదే రోజున మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి . మరి ఆ పోటీలో సిద్దార్థ్ సినిమా ఏమౌతుందో చూడాలి . Comments

FOLLOW
 TOLLYWOOD