ఎల్లుండే శివకాశీపురం ఫస్ట్ సాంగ్ రిలీజ్
TOLLYWOOD
 TOPSTORY

ఎల్లుండే శివకాశీపురం ఫస్ట్ సాంగ్ రిలీజ్

Murali R | Published:October 11, 2017, 6:34 PM IST
సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ వట్టికూటి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మోహన్ బాబు పులి మామిడి నిర్మిస్తున్న చిత్రం      '' శివకాశీపురం '' . స్వర చక్రవర్తి స్వర్గీయ చక్రవర్తి మనవడు , శ్రీ తనయుడు అయిన రాజేష్ శ్రీ చక్రవర్తి ఈ శివకాశీపురం చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు . గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ఈ శివకాశీపురం , కాగా షూటింగ్ కార్యక్రమాలతో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిచేసుకొని సెన్సార్ కి సిద్ధమైంది . 

మొదటి సాంగ్ ఎఫ్ ఎం లో రిలీజ్ 

ఈనెల 13న శివకాశీపురం చిత్రం లోని మొదటి పాటని ఎఫ్ ఎం లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసారు ఆ చిత్ర బృందం . ఇంతకుముందు మాదాల కోటేశ్వర్ రావు దర్శకత్వంలో రూపొందిన  గులాబి చిత్రానికి సంగీతం అందించిన పవన్ శేష ఈ శివకాశీపురం చిత్రానికి నాలుగు అద్భుతమైన పాటలు అందించాడని , అన్ని పాటలు కూడా శ్రోతలను అలరించేలా ఉన్నాయని అలాగే సందర్భానుసారం వచ్చే పాటలు కావడం విశేషం . మా సినిమాలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పాట పాడటం అది సినిమాకు హైలెట్ కావడం చాలా సంతోషంగా ఉంది . ఇక నిర్మాత మోహన్ బాబు పులి మామిడి ఎక్కడ కూడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించారని ....... నా కథ ని నమ్మి నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న మోహన్ బాబు గారికి నా కృతఙ్ఞతలు అంటూ తెలిపాడు దర్శకులు హరీష్ వట్టికూటి . 

సంగీత దర్శకుడు పవన్ శేష మాట్లాడుతూ '' ఈనెల 13న మొదటి పాట ని రిలీజ్ చేస్తున్నాం , ఆదిత్య ద్వారా మా చిత్ర ఆడియో రిలీజ్ అవుతుండటం సంతోషంగా ఉంది , అలాగే ప్రతీ వారం రోజులకు ఒకటిగా మిగతా మూడు పాటలను రిలీజ్ చేస్తామని అన్నాడు . 

నిర్మాత మోహన్ బాబు పులి మామిడి మాట్లాడుతూ " హరీష్ వట్టికూటి చెప్పిన కథ సైకలాజికల్ థ్రిల్లర్ గా అనిపించడంతో వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను . హరీష్ లో మంచి టాలెంట్ ఉంది అందుకే అతడినే డైరెక్టర్ గా పెట్టుకున్నాను , యధార్థ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం మా శివకాశీపురం . పాటలు బాగా వచ్చాయి అలాగే సినిమా కూడా బాగా వచ్చింది తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది , ఇక సినిమాని నవంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు . 
Comments

FOLLOW
 TOLLYWOOD