పెళ్లి చేసుకోనంటున్న మాజీ హీరోయిన్
TOLLYWOOD
 TOPSTORY

పెళ్లి చేసుకోనంటున్న మాజీ హీరోయిన్

Murali R | Published:June 19, 2017, 12:00 AM IST
47 ఏళ్ల వయసులో పెళ్ళికి రెడీ అవుతోంది అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో స్పందించింది మాజీ హీరోయిన్ శోభన . నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అందుకే ఒక బిడ్డని దత్తత తీసుకున్నానని కానీ ఈ వార్తలు రావడం మాత్రం ఆగడం లేదని వాపోయింది శోభన . 90 వ దశకంలో హీరోయిన్ గా సత్తా చాటిన భామ శోభన . తెలుగు , తమిళ , మలయాళ భాషలలో నటించిన ఈ భామ భరతనాట్యం కే తన జీవితం అంకితం అంటోంది.

సినిమాల్లో నటించడం మానేసి భరతనాట్య ప్రదర్శనలు ఇస్తూ కాలం వెళ్లదీస్తోంది . అయితే తన సహచరుడుని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యిందని వార్తలు వచ్చాయి కానీ అవన్నీ గాలి వార్తలే అని కొట్టి పడేస్తోంది శోభన . అప్పుడే 47 ఏళ్ళు అయిపోయాయి ఇక పెళ్లి మీద నాకు ఏమాత్రం ఆలోచన లేదు అంటూ సెలవిచ్చింది శోభన.Comments

FOLLOW
 TOLLYWOOD