రజనీ కూతురు హీరోయిన్ అవుతుందట
TOLLYWOOD
 TOPSTORY

రజనీ కూతురు హీరోయిన్ అవుతుందట

Murali R | Published:August 17, 2017, 12:00 AM IST
సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజనీకాంత్ తాజాగా వి ఐ పి 2 చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే . తాజాగా తమిళనాట రిలీజ్ అయిన ఆ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తుండటం తో సక్సెస్ మీట్ పెట్టారు . అయితే దర్శకురాలి గా పరిచయమైన సౌందర్య త్వరలోనే హీరోయిన్ గా పరిచయం కానుందట. ఇప్పుడు ఈ విషయం తమిళనాట సంచలనం కలిగిస్తోంది .
 

సౌందర్య కు ఆల్రెడీ పెళ్లి అయ్యింది , ఒక బిడ్డకు తల్లి కూడా అయితే బిడ్డ పుట్టిన తర్వాత భర్త కు విడాకులు ఇచ్చింది ప్రస్తుతం రజనీ ఇంట్లోనే ఉంటోంది సౌందర్య . బావ హీరోగా వి ఐ పి 2 చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ భామ ఇక హీరోయిన్ గా మారుతుందట . డైరెక్షన్ కంటే యాక్టింగ్ బెటర్ అని ఫీల్ అయిందేమో . ఇప్పటికే కమల్ హాసన్ ఇద్దరు కూతుర్లు హీరోయిన్ లు అయ్యారు కాగా ఇప్పుడు రజనీకాంత్ చిన్న కూతురు హీరోయిన్ అవుతుందన్న మాట .
Comments

FOLLOW
 TOLLYWOOD