మహేష్ స్పైడర్ ఆ చిత్రానికి కాపీ అట
TOLLYWOOD
 TOPSTORY

మహేష్ స్పైడర్ ఆ చిత్రానికి కాపీ అట

Murali R | Published:July 14, 2017, 12:00 AM IST
మహేష్ బాబు స్పైడర్ చిత్రం హాలీవుడ్ చిత్రమైన '' ది శాతాన్ బగ్ '' అనే చిత్రానికి కాపీ అంటూ ప్రచారం సాగుతోంది . బ్యాంక్ రాబరీ , బయో వార్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అది కాగా అదే స్పూర్తితో స్వల్ప మార్పులతో మహేష్ స్పైడర్ చిత్రం రూపొందుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి . అయితే ఈ వార్తలన్నీ ఉత్త గాసిప్ లేనా లేక వాస్తవమా ? అన్నది తేలాలంటే మాత్రం స్పైడర్ రిలీజ్ అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే .
 
 

మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది . మహేష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది . షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది కానీ ఇంకా రెండు పాటలు మాత్రం బ్యాలెన్స్ గా ఉన్నాయి , వాటిని ఆగస్టు లో చిత్రీకరించడానికి ప్లాన్ చేసారు ఆ చిత్ర బృందం . 
Comments

FOLLOW
 TOLLYWOOD