మురుగదాస్ పై ఒత్తిడి చేస్తున్నారట
TOLLYWOOD
 TOPSTORY

మురుగదాస్ పై ఒత్తిడి చేస్తున్నారట

Murali R | Published:October 23, 2017, 10:24 AM IST
మహేష్ బాబు తో బ్లాక్ బస్టర్ తీస్తాడనుకుంటే డిజాస్టర్ ని అందించి షాక్ ఇచ్చాడు దర్శకులు మురుగదాస్ . గతనెలలో రిలీజ్ అయిన స్పైడర్ ఘోర పరాజయం పొందింది , తెలుగు , తమిళ బాషలలో తెరకెక్కిన ఆ చిత్రంతో బయ్యర్లకు భారీ నష్టాలు వచ్చాయి దాంతో బయ్యర్లు నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారు ఇంకేముందు నిర్మాతలు డైరెక్టర్ మురుగదాస్ ని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే అతడికి రెమ్యునరేషన్ కింద 20 కోట్లు ఇచ్చారట . దాంతో అందులో కొంత సొమ్ము తిరిగి ఇవ్వు అని పోరు పెడుతున్నారట.

120 కోట్ల భారీ బడ్జెట్ తో స్పైడర్ తీశారు , కట్ చేస్తే 50 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది . బిజినెస్ జరిగింది 150 కోట్లు దాంతో 80 కోట్ల వరకు నష్టం వస్తోంది అందుకే బయ్యర్లు నిర్మాతల పై పడుతున్నారు , నిర్మాతలు మురుగదాస్ పై పడుతున్నారు . భారీ నష్టం అని మహేష్ కు తెలియడంతో 5 కోట్లు వెనక్కి ఇస్తానని మాటిచ్చాడు మహేష్ . స్పైడర్ లో నటించినందుకు గాను 23 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు మహేష్ . కానీ సినిమా ప్లాప్ కావడంతో అందులో 5 కోట్లు రిటర్న్ చేయడానికి ఒప్పుకున్నాడు.Comments

FOLLOW
 TOLLYWOOD