మరో గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్న మహేష్
TOLLYWOOD
 TOPSTORY

మరో గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్న మహేష్

Murali R | Published:July 15, 2017, 12:00 AM IST
సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు మరో గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు . ఇప్పటికే స్పైడర్  టీజర్ తో అభిమానులను అలరించిన మహేష్ తాజాగా తన కూతురు సితార పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . సితార పుట్టినరోజు ఈనెల 20న కావడంతో స్పైడర్ ట్రైలర్ రెడీ అవుతోంది . టీజర్ తోనే అంచనాలు పెంచిన స్పైడర్ ట్రైలర్ తో ఎలాంటి సంచలనాలు సృష్టించనున్నాడో చూడాలి.

మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ చిత్ర గ్రాఫిక్స్ వర్క్ ఏకంగా ఆరు దేశాల్లో చేయిస్తున్నారు . సెప్టెంబర్ 27న సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నందున సకాలంలో పూర్తికావడానికి ఆరు దేశాల్లో గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది.Comments

FOLLOW
 TOLLYWOOD