రవితేజ ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా
TOLLYWOOD
 TOPSTORY

రవితేజ ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా

Murali R | Published:June 19, 2017, 12:00 AM IST
మాస్ మహారాజ్ రవితేజ కొన్నాళ్ల విరామం తర్వాత వరుసగా రెండు సినిమాలు చేస్తున్నాడు కాగా ప్రస్తుతం వినబడుతున్న కథనం ప్రకారం ఫ్లాప్ చిత్రాల్ దర్శకుడిగా ముద్ర పడిన శ్రీను వైట్ల కు చాన్స్ ఇస్తున్నాడని . ఒకప్పుడు శ్రీను వైట్ల అంటే క్రేజ్ ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి వరుసగా మూడు డిజాస్టర్ లు ఇచ్చి ఇమేజ్ మొత్తం కోల్పోయాడు . అయితే రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఇంతకుముందు మూడు సినిమాలు వచ్చాయి లక్కీ గా ఆ మూడు కూడా హిట్ అయ్యాయి .
 
 

కెరీర్ తొలినాళ్ళ లో '' నీ కోసం '' , '' వెంకీ '' , '' దుబాయ్ శీను '' చిత్రాలు చేసారు శ్రీను వైట్ల - రవితేజ . ఈ మూడు సినిమాలు కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి . కట్ చేస్తే ఇన్నాళ్ళకు ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది . శ్రీను వైట్ల డైరెక్టర్ అంటే హీరోలంతా ఆమడ దూరం పారిపోతున్నారు మరి . 
Comments

FOLLOW
 TOLLYWOOD