వంద సార్లు చూసాడట ఆ సినిమాని
TOLLYWOOD
 TOPSTORY

వంద సార్లు చూసాడట ఆ సినిమాని

Murali R | Published:December 18, 2017, 1:04 PM IST

ఏదైనా సినిమాని ఎంత బాగున్నప్పటికి ఓ పదిసార్లు చూస్తామేమో కానీ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మాత్రం ఏకంగా వందసార్లు చూసాడట . వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజమే ! ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ప్రకటించాడు. అయితే జక్కన్న ని ఆకర్షించిన ఆ సినిమా ఏదో తెలుసా ...... బ్రేవ్ హార్ట్ అనే హాలీవుడ్ సినిమా. అవును బ్రేవ్ హార్ట్ అనే సినిమాని వందసార్లు చూసినప్పటికీ మళ్లీ మళ్లీ చూడలనిపించే విధంగా ఉందని అంటున్నాడు.

 

బ్రేవ్ హార్ట్ లోని ప్రతీ సన్నివేశం ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంటుందని , ప్రతీ సన్నివేశానికి ఓ అర్ధవంతమైన సందర్భం ఉంటుందని అందుకే ఆ చిత్రాన్ని అన్నిసార్లు చూశానని అంటున్నాడు జక్కన్న . బాహుబలి తో తన స్థాయిని ప్రపంచ వ్యాప్తం చేసుకున్న జక్కన్న తాజాగా ఎన్టీఆర్ , చరణ్ లతో మల్టీస్టారర్ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో మూడు సూపర్ హిట్ చిత్రాలను , చరణ్ తో మగధీర వంటి బ్లాక్ బస్టర్ లను అందించాడు జక్కన్న. ఇక ఇప్పుడు చేయబోయే మల్టీస్టారర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Comments

FOLLOW
 TOLLYWOOD