బాలయ్య లుక్కు రాజమౌళి కి నచ్చిందట
TOLLYWOOD
 TOPSTORY

బాలయ్య లుక్కు రాజమౌళి కి నచ్చిందట

Murali R | Published:September 1, 2017, 12:00 AM IST
నందమూరి బాలకృష్ణ ఈ 101 వ సినిమాలో కొత్తగా ఉన్నాడని కితాబు నిస్తున్నాడు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి . ఈరోజు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన పైసా వసూల్ రిలీజ్ అయ్యింది దాంతో ఆ సినిమాని చూసాడు జక్కన్న . ఇంతకుముందు బాలయ్య వంద సినిమాల్లో ఒకలా కనిపించాడు కానీ ఈ 101 వ సినిమాలో సరికొత్త బాలయ్య కనిపించాడని ఆయన జోష్ ఫుల్ ఎనర్జీ ని ఇచ్చిందని ట్వీట్ చేసాడు.

అంతేకాదు  సినిమా మంచి విజయం సాధించాలని కూడా ట్వీట్ చేసాడు రాజమౌళి . నిజంగానే బాలయ్య కొత్తగా కనిపించాడు కానీ సరైన కథ , కథనం లేకపోవడం అలాగే అరిగిపోయిన మాఫియా బ్యాక్ డ్రాప్ వల్ల సినిమా ఫలితం తేలిపోయింది . బాలయ్య యాక్షన్ , డైలాగ్స్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా ఉన్నప్పటికీ పూరి ఘోరమైన టేకింగ్ తో పైసా వసూల్ టైటిల్ కి న్యాయం చేయలేక పోతోంది . తుది ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే.

Related Links

paisa vasool complete the censor
disaster talk to balakrishna s paisa vasool
ss rajamouli wants only jr.ntrComments

FOLLOW
 TOLLYWOOD