అమరావతి రాజధాని కోసం జక్కన్న
TOLLYWOOD
 TOPSTORY

అమరావతి రాజధాని కోసం జక్కన్న

Murali R | Published:September 29, 2017, 2:35 AM IST
అమరావతి రాజధాని కోసం నడుం బిగించాడు ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు డిజైన్లని పరిశీలించి  కొన్ని ఓకే చేసాడు కానీ తీరా సమయానికి ఇంకా మార్పులు కావాలని అందుకు రాజమౌళి సలహాలు సూచనలు తీసుకోవాలని ఆదేశించాడు .

దాంతో మంత్రి నారాయణ తో పాటు సీఆర్డీఏ అధికారులు రాజమౌళి ని కలిశారు. ఇక తాజాగా రాజమౌళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలిసి రాజధాని నిర్మాణ డిజైన్ లపై చర్చించాడు. బాహుబలి సినిమాని భారీ సెట్టింగులతో రూపొందించాడు కాబట్టి జక్కన్న కి ఈ బాధ్యత అప్పగించాడు చంద్రబాబు. మరి జక్కన్న ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తాడో చూడాలి.Comments

FOLLOW
 TOLLYWOOD