ముగ్గురు హీరోలతో రాజమౌళి సినిమా
TOLLYWOOD
 TOPSTORY

ముగ్గురు హీరోలతో రాజమౌళి సినిమా

Wednesday July 12th 2017
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత మరో భారీ సినిమాకు శ్రీకారం చుడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి . అయితే ఈసారి ఒక్క హీరో కాకుండా ముగ్గురు హీరోలతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది . తెలుగు , తమిళ , హిందీ బాషలలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తెలుగులో ఒక హీరో తమిళంలో ఒక హీరో హిందీలో మరొక హీరో ఇలా ముగ్గురు హీరోలతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

అసలే బాహుబలి తర్వాత వచ్చే సినిమా ఆపై మూడు భాషలలో కాబట్టి తప్పకుండా అంచనాలు ఆకాశమే హద్దుగా ఉండటం ఖాయం . అయితే ఈ విషయాన్నీ జక్కన్న అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . ముగ్గురు హీరోలలో ఒకరు ఎన్టీఆర్ అవడం ఖాయం . ఇక మిగతా ఇద్దరు ఎవరనేది తెలియాల్సి ఉంది.


Comments

FOLLOW
 TOLLYWOOD