ఎన్టీఆర్ చరణ్ లతో రాజమౌళి మల్టీస్టారర్
TOLLYWOOD
 TOPSTORY

ఎన్టీఆర్ చరణ్ లతో రాజమౌళి మల్టీస్టారర్

Murali R | Published:September 29, 2017, 5:23 AM IST
బాహుబలి లాంటి సంచలన చిత్రాల తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఎన్టీఆర్ -  రాంచరణ్ లతో . ఈ వార్త వినడానికే అద్భుతంగా ఉంది ఇక ఈ కాంబినేషన్ లో సినిమా అంటే బాక్స్ లు బద్దలు కావాల్సిందే. బాక్సాఫీసు వద్ద నందమూరి బాలకృష్ణ , మెగాస్టార్ చిరంజీవి బోలెడుసార్లు తలపడ్డారు. పైగా ఇద్దరు కూడా మాస్ హీరోలు కావడంతో భీకరమైన పోరు సాగింది.

ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ , చరణ్ లు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు . ఇద్దరూ మంచి స్నేహితులు అయినప్పటికీ కెరీర్ విషయానికి వస్తే పోటీ పడుతూనే ఉంటారు. ఇక జక్కన్న విషయానికి వస్తే ఎన్టీఆర్ తో మూడు సినిమాలు , చరణ్ తో తిరుగులేని హిట్ మగధీర సినిమాని చేసాడు. కట్ చేస్తే ఇప్పుడు ఈ ఇద్దరినీ కలిపి మల్టీస్టారర్ సినిమా చేశాడంటే ఇక ఆపతరమా ..... నందమూరి - మెగా కుటుంబాల హీరోలు కలిసి నటిస్తే అభిమానుల సంతోషానికి అంతే ఉండదు. ఈ కాంబినేషన్లో సినిమా వస్తే రికార్డుల మోత మోగడం ఖాయం. Comments

FOLLOW
 TOLLYWOOD