జక్కన్నకు షాక్ ఇస్తున్న హీరో
TOLLYWOOD
 TOPSTORY

జక్కన్నకు షాక్ ఇస్తున్న హీరో

Murali R | Published:December 17, 2017, 7:22 AM IST

బాహుబలి తో ఎస్ ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న క్రేజ్ ప్రపంచవ్యాప్తం అయ్యింది దాంతో అతడి దర్శకత్వంలో నటించడానికి పలువురు హీరోలు పోటీ పడుతుండగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మాత్రం రాజమౌళి కి షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అసలు ఈగ సమయంలోనే జక్కన్న అమీర్ ఖాన్ తో సినిమా చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసాడు కానీ అవి ఫలించలేదు. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ మరో షాక్ ఇస్తున్నాడు అమీర్ ఖాన్.

 

మహాభారతం ని భారీ ఎత్తున చిత్రీకరించాలనేది జక్కన్న కల . ఆ విషయాన్ని పలుమార్లు ప్రకటించాడు కూడా. కానీ తాజాగా అమీర్ ఖాన్ మాత్రం మహాభారతం ని సెల్యులాయిడ్ పై ఎక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. జక్కన్న ఆలోచించినట్లుగానే మహాభారతం ని ఒకటి రెండు పార్ట్ లు కాదు ఏకంగా 6 పార్ట్ లుగా చిత్రీకరించాలని భావిస్తున్నాడు అమీర్ ఖాన్. ఇది నిజంగా జక్కన్న కు షాకే .... ఎందుకంటే జక్కన్న ప్లాన్ చేసుకుంటుంటే అమీర్ మరొకరితో మహాభారతం ని తీయబోతున్నాడు .
Comments

FOLLOW
 TOLLYWOOD