టాలీవుడ్ చెప్పిందే నిజమయ్యింది
TOLLYWOOD
 TOPSTORY

టాలీవుడ్ చెప్పిందే నిజమయ్యింది

Murali R | Published:November 19, 2017, 9:04 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ల కాంబినేషన్లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మల్టీస్టారర్ సినిమా చేయనున్నట్లు అప్పట్లో టాలీవుడ్ సమాచారం అందించిన విషయం తెలిసిందే. కట్ చేస్తే తాజాగా రాజమౌళి ఎన్టీఆర్ , చరణ్ లతో కలిసి దిగిన ఫోటోతో అసలు విషయాన్ని చెప్పకనే చెప్పాడు. 
 
 
జక్కన్న తో కలిసి ఎన్టీఆర్ , చరణ్ లు కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ తో  జక్కన్న మూడు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించగా చరణ్ తో మగధీర వంటి సంచలన చిత్రాన్ని అందించాడు. కట్ చేస్తే ఊర మాస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన ఈ ఇద్దరు హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమా అంటే బాక్సాఫీస్ బద్దలు అవడం ఖాయం . ఇక మెగా ఫ్యాన్స్ కు నందమూరి అభిమానులకు కిక్ మామూలుగా ఉండదు. ఈ ఇద్దరు హీరోలకు తోడు జక్కన్న తోడైతే రికార్డుల మోతలు మోగాల్సిందే. అయితే కేవలం ఫోటోలు మాత్రమే రిలీజ్ చేశారు కానీ సినిమా అని ప్రకటించలేదు , కానీ ఈ ముగ్గురూ కలిసి సినిమా చేయబోతున్నారు అన్నది మాత్రం వాస్తవం . Comments

FOLLOW
 TOLLYWOOD