బాలయ్య అంటే ఆ హీరోకు కోపమా
TOLLYWOOD
 TOPSTORY

బాలయ్య అంటే ఆ హీరోకు కోపమా

Murali R | Published:November 22, 2017, 1:11 PM IST
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జై సింహా వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు, కాగా ఆ మరుసటి రోజు నే రవితేజ హీరోగా నటించిన టచ్ చేసి చూడు చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో రాబోయే సంక్రాంతి మళ్లీ స్టార్ వార్ జరుగనుంది.

ఇప్పటికే బాలయ్య - రవితేజ లు రెండుసార్లు పోటీ పడగా రెండుసార్లు కూడా రవితేజ మిరపకాయ్ , కృష్ణ చిత్రాలతో విజయం సాధించగా బాలయ్య మాత్రం ఒక్క మగాడు , పరమవీరచక్ర చిత్రాలతో ఘోర పరాజయాలను అందుకున్నాడు, కాగా ఇప్పుడు మూడోసారి ముచ్చటగా పోటీ పడుతున్నారు జై సింహా , టచ్ చేసి చూడు చిత్రాలతో. బాలయ్య అంటే సంక్రాంతి రారాజు మరి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఏ హీరో విజయం సాధిస్తాడో చూడాలి. అయినా బాలయ్య అంటే రవితేజ కు కోపమా ? అందుకే తన సినిమాని బాలయ్య సినిమాతో పోటీకి దింపుతున్నాడా ? ఏమో ! లోగుట్టుపెరుమాళ్ల కెఱుక.Comments

FOLLOW
 TOLLYWOOD