ఫ్రెండ్ కోసం హీరోని తీసేశాడట
TOLLYWOOD
 TOPSTORY

ఫ్రెండ్ కోసం హీరోని తీసేశాడట

Murali R | Published:October 25, 2017, 6:10 PM IST
దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ - సునీల్ ఇద్దరు కూడా మంచి మిత్రులన్న విషయం తెలిసిందే , ఇద్దరూ కలిసి తొలినాళ్ళ లో చాలా కష్టాలు పడ్డారు కట్ చేస్తే త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు , ఇక సునీల్ హీరో అయ్యాడు కానీ హాస్య నటుడి గా ఉన్నప్పుడే ఎక్కువ పేరు వచ్చింది అలాగే డబ్బు కూడా బాగా సంపాదించాడు అయితే హీరో గా మారిన తర్వాత సక్సెస్ లు మాత్రం దక్కడం లేదు దాంతో రేసులో వెనుకబడి పోయాడు సునీల్ . హీరోగా దెబ్బ పడటంతో మళ్ళీ హాస్య నటుడిగా నటించడానికి సమాయత్తం అవుతున్నాడు సునీల్.

ఎన్టీఆర్ హీరోగా మొన్ననే కొత్త సినిమా స్టార్ట్ చేసాడు త్రివిక్రమ్ , ఆ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మరో ప్రముఖ పాత్రకు నారా రోహిత్ ని అనుకున్నారట కానీ ఇప్పుడు ఆ పాత్రలో సునీల్ చేయడానికి ముందుకు వచ్చాడు దానికి కారణం త్రివిక్రమ్ . సునీల్ తన స్నేహితుడు కావడంతో నారా రోహిత్ కు అనుకున్న పాత్రని సునీల్ కు ఇచ్చాడట .  సునీల్ ఈ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అవుతున్నాడు మళ్ళీ . ఇక హిట్ అందుకోవడం పెద్ద కష్టం కాదేమో!Comments

FOLLOW
 TOLLYWOOD