నాని కి అవకాశం ఇప్పించింది ఎవరో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

నాని కి అవకాశం ఇప్పించింది ఎవరో తెలుసా

Murali R | Published:December 15, 2017, 5:35 AM IST
నాని ఇప్పుడంటే హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు కానీ మొదట్లో నటుడు కాదు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసాడు . శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం '' డీ '' . కాగా ఆ చిత్రానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు అయితే ఆ అవకాశం మాత్రం ఇప్పించింది సునీల్ అంట . ఇదే విషయాన్నీ 2 కంట్రీస్ ఆడియో వేడుకలో చెప్పాడు నాని . ఆరోజు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ సినిమాకు పెట్టించింది సునీల్ అన్నయ్యే ! నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయినప్పటికీ నన్ను బాగా చూసుకునే వాడు అంటూ సునీల్ పై ప్రశంసలు కురిపించాడు నాని . 

 

ఎన్ . శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం '' 2 కంట్రీస్ '' . మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు . సునీల్ -మనీషా రాజ్ జంటగా నటిస్తున్నారు . ఇప్పటికే పలు ప్లాప్ లతో సతమతం అవుతున్న సునీల్ ఈ 2 కంట్రీస్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఈనెల లోనే రిలీజ్ కానున్న ఈ చిత్రం పై దర్శక నిర్మాత ఎన్ . శంకర్ కూడా సక్సెస్ కోసం తహతహలాడుతున్నాడు . 
Comments

FOLLOW
 TOLLYWOOD