విజయేంద్ర ప్రసాద్ మరొకరిని ముంచడానికి రెడీ అయ్యాడు
TOLLYWOOD
 TOPSTORY

విజయేంద్ర ప్రసాద్ మరొకరిని ముంచడానికి రెడీ అయ్యాడు

Murali R | Published:November 14, 2017, 9:31 AM IST
కథా రచయితగా విజయేంద్ర ప్రసాద్ కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి ఎందుకంటే అజరామరమైన , అనిర్వచనీయమైన విజయాలను అందుకున్నాడు రచయితగా కానీ దర్శకుడిగా మారిన ప్రతీసారి ఘోరంగా దెబ్బ తింటూనే ఉన్నాడు . ఇప్పటికే రాజన్న సినిమా చేసాడు అది కాస్త బెటర్ అంతేకాని పెద్దగా హిట్ కాలేదు , దాని తర్వాత తన శిష్యుడు దర్శకత్వంలో సినిమా చేసి బ్లాక్ బస్టర్ ని చేసి పెడతాను నన్ను నమ్ము అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ తో రూపొందించిన '' జాగ్వార్ '' ఘోర పరాజయం పొందింది దాని వల్ల భారీ నష్టాలు వచ్చాయి . 
 
 
 
ఇక ఇటీవలే శ్రీవల్లి అనే సైన్స్ ఫిక్షన్ సినిమాకు దర్శకత్వం వహించాడు విజయేంద్ర ప్రసాద్ . ఆ సినిమా ముక్కీ మూలుగుతూ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది పరమ చెత్త సినిమాగా తేల్చి పడేసారు ప్రేక్షకులు దాంతో ఆ సినిమాని ఎన్నో ఆశలు పెట్టుకొని నిర్మించిన వాళ్ళు ఘోరంగా నష్టపోయారు . ఇక ఇప్పుడేమో మళ్ళీ మెగా ఫోన్ చేతబట్టడానికి రెడీ అయ్యాడు విజయేంద్ర ప్రసాద్ . ఇక ఇప్పుడేమో సునీల్ హీరో , ఇప్పటికే సునీల్ కెరీర్ స్లంప్ లో ఉంది డైరెక్టర్ గా విజయేంద్ర ప్రసాద్ ఇంకా ఘోర పరాజయాల్లో ఉన్నాడు మరి ఈ ఇద్దరూ కలిసి ముంచేది ఎవరినో . Comments

FOLLOW
 TOLLYWOOD