సూపర్ హిట్ కొట్టేసిన ఎన్టీఆర్
TOLLYWOOD
 TOPSTORY

సూపర్ హిట్ కొట్టేసిన ఎన్టీఆర్

Murali R | Published:September 29, 2017, 2:52 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది . ఈరోజు భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా జై లవకుశ చిత్రం రిలీజ్ అయిన విషయం తెలిసిందే . ఫస్టాఫ్ లో కాస్త ఎంటర్ టైన్ మెంట్ తో పాటు లవ్ సీన్స్ తో సాగగా సరిగ్గా ఇంటర్వెల్ బ్యాంగ్ కి జై ఎంటర్ అయి మరింతగా అంచనాలు పెంచాడు . జై రావణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో ఫస్టాఫ్ చివర్లో రుచి చూపించి ప్రేక్షకులను థ్రిల్ చేసారు . ఇక సెకండాఫ్ లో ఎన్టీఆర్ రావణ్ క్యారెక్టర్ తీరు తెన్నులతో ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులు ఊగిపోయేలా చేసాడు .

బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించగా ఎన్టీఆర్ నట విశ్వరూపం కు తోడూ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్ గా నిలిచింది . మొత్తానికి ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఈలలతో గోల చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . మొత్తానికి జై లవకుశ తో ఎన్టీఆర్ సూపర్ హిట్ కొట్టేసాడు . మాస్ కి కిక్ ఇచ్చే హిట్ ఇచ్చాడు ఎన్టీఆర్ . Comments

FOLLOW
 TOLLYWOOD