రొమేనియాలో సూపర్‌స్టార్‌ మహేష్‌
TOLLYWOOD
 TOPSTORY

రొమేనియాలో సూపర్‌స్టార్‌ మహేష్‌

Murali R | Published:August 26, 2017, 12:00 AM IST

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. ఈ చిత్రానికి సంబంధించి బ్యాలెన్స్‌ వున్న పాట చిత్రీకరణ రొమేనియాలో ఆగస్ట్‌ 25న ప్రారంభమైంది. ఆగస్ట్‌ 31 వరకు ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Comments

FOLLOW
 TOLLYWOOD