Home Topstories త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ తెలుగులో
TOLLYWOOD
 TOPSTORY

త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ తెలుగులోSaturday July 15th 2017
త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన `ఓరుబంతి  నాల్‌ర‌న్ ఓరు వికెట్‌` తెలుగులో `కాదంబ‌రి` (ఇంటి నెంబ‌ర్ 150) పేరుతో అనువాద‌మై రిలీజ‌వుతోంది. జె.లోకేశ్వ‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్.డి.ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తోంది. జె.రాధా శివ‌రామ్‌, మ‌న్వ‌ర్ భాషా ఈ చిత్రానికి నిర్మాత‌లు. అనువాద కార్య‌క్ర‌మాలు స‌హా సెన్సార్ ప‌నులు పూర్త‌య్యాయి. ఈ నెల‌లోనే సినిమా రిలీజ్ కానుంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ -``మా బ్యాన‌ర్‌లో తొలి ప్ర‌య‌త్న‌మిది. చ‌క్క‌ని హార‌ర్ బేస్డ్ సినిమా ఇది. హార‌ర్ జోన‌ర్‌లోనే ట్రెండీగా ఉండే సినిమా... హార‌ర్‌లో ఇదివ‌ర‌కూ వ‌చ్చిన సినిమాల‌తో పోలిస్తే ఇది విభిన్న‌మైన చిత్రం. త‌మిళ్ లో ఘ‌న‌విజ‌యం సాధించిన‌ట్టే, తెలుగులోనూ అంతే పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. తెలుగు అనువాదం పూర్త‌యింది. ఈ నెల‌లోనే రిలీజ్ చేయ‌నున్నాం`` అని తెలిపారు.

Comments

FOLLOW
 TOLLYWOOD
POLLS
Read More..