ఆత్మహత్య చేసుకున్న దర్శక నిర్మాత
TOLLYWOOD
 TOPSTORY

ఆత్మహత్య చేసుకున్న దర్శక నిర్మాత

Murali R | Published:November 22, 2017, 4:41 PM IST
తమిళనాట ఓ దర్శక నిర్మాత ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది .అప్పులపాలు కావడంతో ఫైనాన్స్ చేసిన వాళ్ళు బాగా ఒత్తిడి చేయడంతో ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్య కు పాల్పడ్డాడు దర్శక నిర్మాత బి . అశోక్ కుమార్ . తమిళ నటుడు , దర్శక నిర్మాత అయిన శశికుమార్ కు అశోక్ కుమార్ సమీప బంధువు . శశికుమార్ తీసిన సినిమాలకు కూడా పార్ట్ నర్ గా వ్యవహరించాడు అశోక్ కుమార్ . అయితే ఇటీవల చేసిన సినిమాలు ఫ్లాప్ అవడంతో ఫైనాన్సియర్ ల దగ్గర చేసిన అప్పులు మెడకు చుట్టుకున్నాయి . 
 
 
 
డబ్బులు ఇవ్వమని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటన ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తోంది . అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం శోచనీయమని రైతులతో పాటు ఇప్పుడు ఇండస్ట్రీ ని పోషిస్తున్న నిర్మాతలు కూడా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వాపోయాడు హీరో సిద్దార్థ్ . అశోక్ కుమార్ మృతికి ఫైనాన్షియర్ ల వేధింపులు కారణం కావడంతో వాళ్ళ పై పోలీసులకు ఫిర్యాదు చేసాడు శశికుమార్ .Comments

FOLLOW
 TOLLYWOOD