పవన్ పై ఆగ్రహంగా ఉన్న టిడిపి
TOLLYWOOD
 TOPSTORY

పవన్ పై ఆగ్రహంగా ఉన్న టిడిపి

Thursday August 17th 2017
పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి మద్దతు ఇస్తాడని అందరూ ఊహించారు కానీ నంద్యాల ఉప ఎన్నిక దగ్గర పడుతున్న వేళ నేను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని తేల్చి చెప్పడంతో తెలుగుదేశం పార్టీ తీవ్ర షాక్ కి గురయ్యింది . ఇన్నాళ్లు తెలుగుదేశానికి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మద్దతు ఇవ్వకపోవడం వల్ల కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు అని భావిస్తున్నారు . పవన్ కు ప్రత్యేకంగా కార్యకర్తలు , నాయకులు అంటూ ఎవరూ లేరు కానీ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు ఎటు వెళతాయో అన్న మీమాంస లో ఉన్నారు .
 

అయితే పవన్ మద్దతు లేదని తేల్చి చెప్పడంతో కొంతమంది తెలుగుదేశం నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . పవన్ మద్దతు ఇస్తే ఎంత ? ఇవ్వకపోతే ఎంత ? అసలు పవన్ కు కార్యకర్తలే లేరు అతడు మద్దతు ఇవ్వడం వల్ల ఒనగూడే ప్రయోజనం కూడా ఏమిలేదు అంటూ పవన్ పై నిప్పులు చెరుగుతున్నారు తెలుగుదేశం నాయకులు . Comments

FOLLOW
 TOLLYWOOD