ఆ సినిమాలు రిలీజ్ అవ్వడం కష్టమేనట
TOLLYWOOD
 TOPSTORY

ఆ సినిమాలు రిలీజ్ అవ్వడం కష్టమేనట

Murali R | Published:November 15, 2017, 8:33 PM IST
మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ లు ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలు అవుతున్నాయి. అయితే అందులో ఒకటి లక్ష్మీస్ వీరగ్రంధం జస్ట్ ప్రారంభోత్సవం జరుపుకుంది కానీ మిగతా సినిమాలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఎన్టీఆర్ పై వస్తున్న సినిమాలు ఎక్కువ కావడంతో జనాలు అయోమయం కావడం ఖాయం . దాంతో ఇదే ప్రశ్న ని బాలయ్య తో ఎన్టీఆర్ బయోపిక్ ప్లాన్ చేస్తున్న తేజ ని అడిగితే అసలు ఎన్టీఆర్ పై వస్తున్న ఆ సినిమాలు రిలీజ్ అవ్వడం కష్టమే అని తేల్చి చెప్పారు తేజ.

నేనే రాజు నేనే మంత్రి వంటి సూపర్ హిట్ తర్వాత తేజ కు బాలయ్య ని డైరెక్ట్ చేసే ఛాన్స్ లభించింది. దాంతో ఆ స్క్రిప్ట్ ని రూపొందించే పనిలో పడ్డాడు తేజ . అయితే ఎన్టీఆర్ పేరు తో ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా వస్తున్న సినిమాలు రిలీజ్ కావని ఎందుకంటే ఆ సినిమాలు రిలీజ్ కావాలంటే ఎన్టీఆర్ కుటుంబం అనుమతి తప్పనిసరి అని వాళ్ళు అనుమతి ఇవ్వకపోతే ఆ సినిమా లు రిలీజ్ కావని స్పష్టం చేశాడు తేజ. మరి ఈ విషయం రాంగోపాల్ వర్మ కు తెలియదా.Comments

FOLLOW
 TOLLYWOOD