తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి' కార్యవర్గం రద్దు
TOLLYWOOD
 TOPSTORY

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి' కార్యవర్గం రద్దు

Murali R | Published:November 21, 2017, 3:32 PM IST

ఎన్నో సంవత్సరాలుగా TFPC (Telugu Film Producers Council) సభ్యులు కోరుకుంటున్న విధంగా, TFPC (తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి) ప్రస్తుత కార్యవర్గం రద్దు కాబడింది. 19.11.2017న జరిగిన సర్వసభ్య సమావేశంలో (17th Annual General Body Meeting) ఏకగ్రీవంగా ప్రస్తుత కార్యవర్గాన్ని తక్షణం రద్దు చేసి, వెంటనే ఒక Ad-hoc Committeeని ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించవల్సిందిగా తీర్మానించటమైనది.

 

అనేక సంవత్సరాలుగా ‘కోర్ట్’ కేసులు అడ్డంపెట్టుకుని ఎన్నికలు జరిపించకుండా, అనేక ఆరోపణలు వస్తున్నా సమాధానం చెప్పకుండా, కోర్ట్ ధిక్కారం అని తెలిసి కూడా ఇష్టారాజ్యంగా ‘బై లాస్’ మారుస్తూ,  అనేక అవకతవకలకు, లక్షల నిధుల దుర్వినియోగానికి ఆస్కారం కల్పిస్తూ, చిన్న నిర్మాతల సమస్యలను పట్టించుకోకుండా స్వార్ధంతో,తమ వ్యక్తిగత లాభం కోసం, TFPC ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ పని విధానానికి ఎంతో వ్యతిరేకత వచ్చినా పట్టించుకోకుండా, అహంకారంతో నిర్మాతల మండలిని తమ సొంత సంస్థ లాగా నడిపారు. Movie Towersలో కొన్ని కోట్లు వెచ్చించటం, Associated Producers Of Telugu LLP ఎదుగుదల కోసం నిర్మాతల మండలిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చెయ్యటం,కొన్ని లక్షల ఖర్చుతో తమ సొంత ప్రయోజనాల కోసం TFPC Websiteని నడపటం,మండలి కార్యాలయం Rooms లో ఆఫీస్ బేరర్స్ వచ్చి కూర్చోరాదనే నియంతృత్వనిభందనలు, కొన్ని నెలల పాటు Health insuranceని రెన్యూల్ చెయ్యకుండా సభ్యులను ఇబ్బంది పెట్టటం, మూవీ టవర్స్- 2 కడతామని హడావిడి, కొన్ని సంవత్సరాలుగా Annual report(ఆదాయ, జమా ఖర్చుల పరిశీలన) పంపటంలేదని ప్రశించినవారిపై చర్యలు తీసుకుంటామని బెదిరించటం, తమ వ్యక్తిగత వ్యాపారానికి, పనులకు TFPCని వాడుకోవటం, ఇతర రాష్ట్రాల కన్నా పెరిగిన QUBE,UFO రేట్లు తగ్గించే ప్రయత్నం చెయ్యకపోవటం, చిన్న నిర్మాతల ధియేటర్ల సమస్య పట్టించుకోకుండా ఒకరిద్దరి కోసం మాత్రమే పనిచెయ్యటం… వంటి అనేక పరిష్కారం కాని సమస్యలతో, ఎన్నడూ TFPC Officeకి రాని, అందుబాటులో ఉండని ప్రెసిడెంట్ తో విసిగిపోయిన సభ్యులకు ఎన్నికలు రావటం ఎంతో సంతోషదాయకం.
Comments

FOLLOW
 TOLLYWOOD