పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న `ద‌ళ‌ప‌తి`
TOLLYWOOD
 TOPSTORY

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న `ద‌ళ‌ప‌తి`

Murali R | Published:October 25, 2017, 6:30 PM IST
ఆది అక్షర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సదా  దర్శకత్వంలో బాబురావు పెదపూడి నిర్మించిన చిత్రం `దళపతి`.  సదా , కవితా అగర్వాల్  హీరో హీరోయిన్లుగా  నటిస్తున్నారు . ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌కుడు సదా  మాట్లాడుతూ " విభిన్న కథాంశం తో యాక్షన్ , ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా  తెరకెక్కుతున్న` దళపతి` నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. సినిమా కు ఛాయాగ్రాహకులు జై అందించిన సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలుస్తుంది`` అన్నారు.

నిర్మాత బాబురావు మాట్లాడుతూ '' దర్శకులు సదా సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్తయ్యాయి. అవుట్ పుట్ బాగా వ‌చ్చింది. యాజ‌మాన్య సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా శ్రేయాఘోష‌ల్‌గారు పాడిన పాట‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వచ్చింది.   రజనీకాంత్ దళపతిలా మా సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది.  మా మొదటి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని న‌మ్మ‌కం ఉంది. సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.Comments

FOLLOW
 TOLLYWOOD