సంచలనం సృష్టిస్తున్న TFJA
TOLLYWOOD
 TOPSTORY

సంచలనం సృష్టిస్తున్న TFJA

Murali R | Published:November 22, 2017, 10:42 AM IST
ఫిలిం జ‌ర్న‌లిస్టుల సంక్షేమ‌మే ధ్యేయంగా ఏర్ప‌డిన టి.ఎఫ్.జె.ఏ ( తెలుగు ఫిలిం జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్) జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకుంటూ...క‌ష్టాల్లో ఉన్న వారి క‌న్నీటిని తుడుస్తూ..మేమున్న‌మాంటూ ఓ ధైర్యం ఇస్తుంది టెప్జా. అందుకే అన‌తి కాలంలోనే టెప్జా కు టాలీవుడ్ లో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆరోగ్య కార్డుల‌ను కూడా పొంద‌డం జ‌రిగింది.

తాజాగా మ‌రోసారి మంగ‌ళ‌వారం  తెలంగాణ ఫిలిం డ‌వ‌లెప్ మెంట్ కార్పోరేష‌న్ (ఎఫ్.డి.సి) చైర్మ‌న్  శ్రీ. పి. రామ్మోహ‌న‌రావు దృష్టికి జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌ను తీసుకెళ్ల‌డం జ‌రిగింది. దీనిలో భాగంగా అధ్య‌క్షులు రామ‌నారాయ‌ణ‌రాజు, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గోరంట్ల సత్యం, జాయింట్ సెక్ర‌ట‌రీ పి. స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి, ట్రెజ‌ర‌ర్ స‌తీష్, ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ ద‌య్యాల అశోక్ తో పాటు, కార్య‌వ‌ర్గ స‌భ్యుల ఆధ్వ‌ర్యంలో ఫిలిం జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల గురించి లిఖిత పూర్వ‌కంగా విన్న‌పం అదించ‌డం జ‌రిగింది. మెమోరాండ్రం లో ఉన్న విష‌యాలు..

*తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌బోయే అవార్డుల క‌మిటీలో ఫిలిం జ‌ర్న‌లిస్టుల‌కు త‌గిన ప్రాధ‌న్య‌త‌
* రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తీ ఏటా అందించే హెల్త్ కార్డుల‌ను టెప్జాలో  ప్ర‌తీ స‌భ్యుడుకి అందేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం
* జ‌ర్న‌లిస్టుల ప్ర‌ధాన డిమాండ్ అయిన  ప్ర‌భుత్వ ఇళ్ల స్థ‌లాలు ప్ర‌తీ స‌భ్యుడికి అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టి.ఎఫ్.జె.ఏ కోర‌డం జరిగింది.Comments

FOLLOW
 TOLLYWOOD