ఎవరికి వారు మాదే హిట్ అంటున్నారు
TOLLYWOOD
 TOPSTORY

ఎవరికి వారు మాదే హిట్ అంటున్నారు

Murali R | Published:August 10, 2017, 12:00 AM IST
రేపు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి , దాంతో పోటీపడి మరీ ఎవరికి వారు మా సినిమా హిట్ అంటే లేదు లేదు మా సినిమా హిట్ అంటూ ఊదరగొట్టేస్తున్నారు . దాంతో అసలు బరిలో నిలిచి గెలిచే సినిమా ఏది అన్న అనుమానం నెలకొంటోంది . బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన భారీ చిత్రం '' జయ జానకి నాయక '' చిత్రం రిలీజ్ అవుతుండగా ....... 
 

అదే రోజున హను రాఘవపూడి దర్శకత్వంలో  నితిన్ - మేఘా ఆకాష్  నటించిన లై , తేజ దర్శకత్వంలో రానా - కాజల్ అగర్వాల్ కేథరిన్ లు నటించిన నేనేరాజు నేనే మంత్రి చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి . ఈ మూడు చిత్రాలు కూడా సై అంటే సై అంటున్నాయి . మూడు చిత్రాల దర్శక నిర్మాతలు కూడా మా సినిమా హిట్ అంటే మా సినిమా హిట్ అని అంటున్నారు . రేపు రిలీజ్ అయ్యాక కానీ తెలీదు ఏది హిట్ ? ఏది ఫట్ . 
Comments

FOLLOW
 TOLLYWOOD