డ్రగ్స్ తో సంబంధం లేదంటున్నారు
TOLLYWOOD
 TOPSTORY

డ్రగ్స్ తో సంబంధం లేదంటున్నారు

Murali R | Published:July 14, 2017, 12:00 AM IST
డ్రగ్స్ తో మాకెలాంటి సంబంధం లేదని అంటున్నారు యంగ్ హీరోలు తనీష్ , నందు లు అలాగే నటుడు సుబ్బరాజు ,ఆర్ట్ డైరెక్టర్ చిన్నా లు . మా పేర్లు ఎలా బయటకు వచ్చాయో తెలీదు దయచేసి మా పేర్లు మీడియాలో రాయొద్దు అని వేడుకుంటున్నారు . వీళ్ళ పేర్లు మాత్రమే కాదు హీరో రవితేజ , దర్శకులు పూరి జగన్నాధ్ , హీరోయిన్ ఛార్మి , ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్ , నవదీప్ , తరుణ్ ల పేర్లు లీక్ అయ్యాయి .
 
 

వీళ్ళు మాత్రమే కాదు ఇంకా పలువురు పేర్లు ఈ డ్రగ్స్ కేసులో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు . మొత్తం గా సినిమా వాళ్ళు 48 మంది ఉన్నారట అయితే అందులో ఎక్కువగా టచ్ లో ఉన్నవాళ్లు 19 మంది అని అంటున్నారు . ఇది 19 తోనో 48 మంది తోనో ఆగిపోతుందా ? లేక ఇంకా పెరుగుతుందా ? చూడాలి . అయితే మీడియాలో ఉదయం నుండి ఈ పేర్లు రావడం సంచలనం సృష్టిస్తోంది . 
Comments

FOLLOW
 TOLLYWOOD