కొద్దిరోజులైతే డ్రగ్స్ కేసు కూడా ......
TOLLYWOOD
 TOPSTORY

కొద్దిరోజులైతే డ్రగ్స్ కేసు కూడా ......

Murali R | Published:July 15, 2017, 12:00 AM IST
ఇప్పుడంటే డ్రగ్స్ కేసు ప్రధాన వార్త అయి కూర్చుంది కానీ మరో వారం , పది రోజులు గడిస్తే మరుగున పడిపోవడం ఖాయం ఎందుకంటే ఈ డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు . వాళ్ళ పేర్లు బయటకు రావు , ఒకవేళ వచ్చినా తెరవెనుక చాలా జరుగుతాయి కాబట్టి కొద్ది రోజులే ఈ హడావుడి.

ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. పైగా మరో కొత్త సమస్య ఏదో ఒకటి వస్తుంది కాబట్టి ఈ డ్రగ్స్ వ్యవహారం మరుగున పడటం ఖాయం . ఇప్పుడు బయటకు వచ్చిన పేర్లలో కొన్ని ముందే సెన్సార్ అయ్యాయి. మరో లిస్ట్ బయటకు వచ్చినా దోషులుగా చిన్నవాళ్ళు దొరుకుతారు కానీ పెద్దవాళ్ళు కాదు. ఇక జనాలకు కూడా ఈ కేసు పై ఆసక్తి పోతుంది ఎందుకంటే మరొకొత్త సమస్య వస్తుంది కాబట్టి. మొత్తానికి ఏతా వాతా చెప్పొచ్చేదేమంటే కొంతమంది మాత్రమే బలిపశువులు అయ్యేది.Comments

FOLLOW
 TOLLYWOOD