డ్రగ్స్ కేసులో బలయ్యేది చిన్నవాళ్లేనా
TOLLYWOOD
 TOPSTORY

డ్రగ్స్ కేసులో బలయ్యేది చిన్నవాళ్లేనా

Murali R | Published:July 14, 2017, 12:00 AM IST
డ్రగ్స్ రాకెట్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ని ఓ ఊపు ఊపేస్తోంది , తాజాగా పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి అయితే ఇందులో కొంతమంది మాత్రం మాకు సంబంధం లేదని తేల్చి చెప్పగా పూరి జగన్నాధ్ , ఛార్మి , రవితేజ , ముమైత్ ఖాన్ , తరుణ్ లాంటి వాళ్ళు ఇంకా స్పందించలేదు , ఆ విషయాన్నీ పక్కన పెడితే ఈ డ్రగ్స్ రాకెట్ లో ఓ అగ్ర నిర్మాత తో పాటు అతడి కొడుకు పేరు తప్పించినట్లు గా జోరుగా ప్రచారం సాగుతోంది.

విచిత్రం ఏంటంటే సదరు అగ్ర నిర్మాత మొన్న మీడియా ముందుకు వచ్చి డ్రగ్స్ వాడొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం . సదరు నిర్మాతకు పలుకుబడి బాగా ఉండటంతో అతడి తో పాటు అతడి కొడుకు పేరు తప్పించినట్లు తెలుస్తోంది . మొత్తానికి డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ లో పెను సంచలనం సృష్టించినప్పటికీ చివరాఖరున బలయ్యేది మాత్రం చిన్నవాళ్లు మాత్రమే ! అని స్పష్టం అవుతోంది.Comments

FOLLOW
 TOLLYWOOD