ఆ పదిమంది ఎవరో
TOLLYWOOD
 TOPSTORY

ఆ పదిమంది ఎవరో

Murali R | Published:July 12, 2017, 12:00 AM IST
సినిమా రంగంలోని వాళ్లలో కేవలం పదిమంది మాత్రమే డ్రగ్స్ వాడుతున్నారని , ఆ పదిమంది తక్షణం తమ పద్దతి మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేసాడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ . సినిమా రంగం వాళ్ళు  డ్రగ్స్ వాడుతున్నారంటూ ప్రాపగండా చేస్తున్నారని కానీ అందరూ కాదని కేవలం కొంతమంది మాత్రమే కాబట్టి మీడియా కూడా సహనం ప్రదర్శించాలని అంటున్నాడు అల్లు అరవింద్ .
 
 

డ్రగ్స్ కలకలం చెలరేగిన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చారు అల్లు అరవింద్ , శివాజీ రాజా , సురేష్ బాబు , శ్రీకాంత్ లు అయితే డ్రగ్స్ వాడుతున్న ఆ పదిమంది ఎవరో మాత్రం చెప్పలేదు కానీ వాళ్లకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసాడు అల్లు అరవింద్ . ఇటీవల డ్రగ్స్ ముఠా పట్టుబడిన నేపథ్యంలో పలువురు సినిమా వాళ్ళు ఉన్నట్లు వార్తలు వచ్చాయి దాంతో ఈ సమావేశం నిర్వహించారు .
Comments

FOLLOW
 TOLLYWOOD