మళ్ళీ మహేష్ - వెంకటేష్ ల కాంబినేషన్
TOLLYWOOD
 TOPSTORY

మళ్ళీ మహేష్ - వెంకటేష్ ల కాంబినేషన్

Murali R | Published:December 16, 2017, 8:28 AM IST
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో మల్టీ స్టారర్ చిత్రాలకు ఊపు తెచ్చిన హీరోలు వెంకటేష్ - మహేష్ బాబు లు . ఆ సినిమా తర్వాతే బోలెడు చిత్రాలు మల్టీ స్టారర్ లెవల్లో వస్తున్నాయి . పైగా మహేష్ బాబు - వెంకటేష్ నిజమైన అన్నాదమ్ములను తలపించేలా చేయడంతో ఆ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది . కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ మహేష్ - వెంకటేష్ లతో మల్టీ స్టారర్ చిత్రాన్ని చేయనున్నట్లు అది కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది . 

 

ఇటీవల వెంకటేష్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఓ స్టిల్ వదిలారు ఆ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకులు కాగా రాధాకృష్ణ నిర్మాత . అయితే అదే చిత్రంలో మహేష్ బాబు నటించనున్నట్లు తెలుస్తోంది అంటే మల్టీ స్టారర్ చిత్రం అన్నమాట . మహేష్ - వెంకటేష్ - త్రివిక్రమ్ లు కలిసి సినిమా చేస్తే ఇక బాక్స్ లు బద్దలు కావాల్సిందే . ఈ కాంబినేషన్ ని తట్టుకోవడం ఎవరికైనా సాధ్యమా ? మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కి అలాగే వెంకటేష్ ఫ్యాన్స్ కి పెద్ద రచ్చ రంబోలా అన్నమాట .
Comments

FOLLOW
 TOLLYWOOD