బాలయ్య ఆమెకు దేవుడట
TOLLYWOOD
 TOPSTORY

బాలయ్య ఆమెకు దేవుడట

Murali R | Published:November 20, 2017, 5:28 PM IST
నటసింహం నందమూరి బాలకృష్ణ నాకు దేవుడితో సమానమని అంటోంది యాంకర్ కం నటి అయిన ఉదయభాను . ఆమధ్య ఉదయభాను కి కవల పిల్లలు పుట్టిన విషయం తెలిసిందే . అయితే తన ఇద్దరు పిల్లలకు పెద్ద ఎత్తున ఫంక్షన్ చేయాలనీ అనుకుందట కానీ ఇండస్ట్రీ వాళ్ళని పిలవాలని ఫోన్ లు చేస్తే చాలామంది ఉదయభాను ఫోన్ ఎత్తలేదట పైగా కొంతమంది ఏమో బిజీ అని చెప్పారట అలాగే కొంతమంది వస్తామని చెప్పి మొహం చాటేశారట కానీ బాలయ్య మాత్రం చాలా బిజీ గా ఉన్నప్పటికీ వస్తానని చెప్పడమే కాకుండా ఫంక్షన్ కు వచ్చి 45 నిముషాలు ఉన్నాడట . 
 
 
 
ఎవరైనా సెలబ్రిటీ వస్తే 5 , పది నిముషాలు ఉంటే ఎక్కువ కానీ బాలయ్య మాత్రం 45 నిమిషాల వరకు ఉండి మా వాళ్ళని అందరినీ పలకరించి ప్రతీ ఒక్కరితో ఫోటోలు దిగాడని అందుకే ఆయన నాకు దేవుడని కన్నీళ్ళ పర్యంతం అవుతోంది ఉదయభాను . కొద్దిరోజులు సినిమాలకు దూరమైన ఉదయభాను మళ్ళీ సినిమాల్లో నటించడానికి రెడీ అవుతోంది .Comments

FOLLOW
 TOLLYWOOD