ఉపేంద్ర కొత్త పార్టీ పెడుతున్నాడు
TOLLYWOOD
 TOPSTORY

ఉపేంద్ర కొత్త పార్టీ పెడుతున్నాడు

Murali R | Published:August 13, 2017, 12:00 AM IST
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించాడు . కర్ణాటకలో ఇప్పటికే జనతాదళ్ , కాంగ్రెస్ , బిజెపి బలంగా ఉన్నాయి అటువంటి సమయంలో ఇప్పుడు ఉపేంద్ర పార్టీ పెట్టడం వల్ల జనాలు ఇతడ్ని నమ్ముతారా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . ఇప్పటికే పలువురు నటీనటులు రాజకీయాల్లో కి వచ్చారు , అందులో కొంతమంది సక్సెస్ కాగా మరికొంతమంది చతికిల బడ్డారు .
 

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఉపేంద్ర ని అప్పుడే టార్గెట్ చేసారు పలువురు . ఇక సోషల్ మీడియాలో అయితే ఉపేంద్ర కు అనుకూలంగా పోస్ట్ పెట్టె వాళ్ళకంటే వ్యతిరేకంగా పోస్ట్ పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు . త్వరలోనే కర్ణాటకలో ఎన్నికలు రానున్నాయి ఈ నేపథ్యంలో ఉపేంద్ర పార్టీ ఏ మేరకు సత్తా చాటుతుందో తెలియాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే . 
Comments

FOLLOW
 TOLLYWOOD