సైరా నరసింహారెడ్డి పై అప్పుడే విమర్శలు
TOLLYWOOD
 TOPSTORY

సైరా నరసింహారెడ్డి పై అప్పుడే విమర్శలు

Wednesday August 23rd 2017
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని చేయనున్నట్లు ప్రకటించారు అయితే ఓపెనింగ్ కు వచ్చేసరికి  '' సైరా ....... నరసింహారెడ్డి '' అయ్యింది . అయితే ఈ టైటిల్ పట్ల తొలుత అందరూ షాక్ అయినప్పటికీ ఇది కూడా బాగానే ఉంది అని అనుకున్నారు కట్ చేస్తే కొంతమంది మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు . ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి సంబందించిన వాళ్ళు , అభిమానించే వాళ్ళు కూడా పూర్తిపేరు పెట్టకుండా అవమానిస్తున్నారని అప్పుడే విమర్శలకు దిగుతున్నారు.

అయితే విమర్శల సంగతి ఎలా ఉన్నా '' సైరా ....... నరసింహారెడ్డి '' భారీ బడ్జెట్ తో భారీ తారాగణం తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి చిరంజీవి భాషలో చెప్పాలంటే బాక్స్ లు బద్దలైపోవడం ఖాయం అని నమ్ముతున్నారు . తెలుగు , తమిళ , మలయాళ , హిందీ బాషలలో 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా కాబట్టి పెద్ద హిట్ అవ్వడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం.


Comments

FOLLOW
 TOLLYWOOD