చిరంజీవి కొత్త సినిమా మొదలయ్యింది
TOLLYWOOD
 TOPSTORY

చిరంజీవి కొత్త సినిమా మొదలయ్యింది

Murali R | Published:August 16, 2017, 12:00 AM IST
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ఈరోజు  ప్రారంభమైంది . మంచి ముహూర్తం ఉండటం తో ఈనెల 22వరకు ఆగకుండా వెంటనే ఈరోజు ప్రారంభించారు . ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిరంజీవి దంపతులు , అల్లు అరవింద్ , చరణ్ , దర్శకులు సురేందర్ రెడ్డి లతో పాటు పరుచూరి బ్రదర్స్ హాజరయ్యారు . అసలు ఈ ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి చిత్రాన్ని మొదట తన 150 వ చిత్రంగా చేయాలనీ అనుకున్నాడు చిరు .
 

కానీ భారీ బడ్జెట్ పైగా ఎక్కువ రోజుల పాటు షూటింగ్ చేయాల్సి వస్తుండటంతో ఉయ్యాలవాడ ని వాయిదా వేశారు . కట్ చేస్తే ఖైదీ నెంబర్ 150 పెద్ద హిట్ కావడం 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు . తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందనుంది ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రం .
Comments

FOLLOW
 TOLLYWOOD