యాభై రోజుల దిశగా వైశాఖం
TOLLYWOOD
 TOPSTORY

యాభై రోజుల దిశగా వైశాఖం

Murali R | Published:September 7, 2017, 12:00 AM IST
హరీష్ - అవంతిక జంటగా డైనమిక్ లేడీ డైరెక్టర్ బి. జయ దర్శకత్వంలో స్టార్ పీఆర్ ఓ బి ఏ రాజు నిర్మించిన చిత్రం వైశాఖం. జూలై నెలాఖరున రిలీజ్ అయిన వైశాఖం చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు దాంతో దిగ్విజయంగా అర్ధ శతదినోత్సవం  పూర్తిచేసుకుంటోంది రేపు. ఈరోజుకి 49 రోజులను పూర్తి చేసుకోవడంతో ఆ చిత్ర యూనిట్ ఆనందం లో మునిగితేలుతోంది. జయ దర్శకత్వ ప్రతిభ , బి ఏ రాజు నిర్మాణ శైలి వెరసి వైశాఖం ని హిట్ చేసాయి.

అత్యంత ప్రమాదకరమైన , కష్ట సాధ్యమైన కజకిస్థాన్ లో పాటల చిత్రీకరణ జరుపుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం వైశాఖం. ఎంతో కష్ట నష్టాలకు ఓర్చి షూటింగ్ చేశారు కాబట్టే తెరమీద అంతకంటే అందంగా పాటలు వచ్చాయి. డీజే వసంత్ సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. సుబ్బారావు కెమెరా పనితనం ,  సాయి కుమార్ స్పెషల్ అప్పియరెన్స్ అన్నింటినీ మించి మానవతా విలువలను తట్టిలేపే కథాంశం కావడంతో వైశాఖం యాభై రోజుల దిశగా దూసుకుపోతోంది. వెయ్యి కి పైగా సంచలనాత్మక చిత్రాలకు పీఆర్ ఓ గా సేవలందించి చిత్రపరిశ్రమలో అజాత శత్రువుగా పేరు గాంచిన బి ఏ రాజు మరోసారి వైశాఖం తో మరో హిట్ కొట్టాడు.

Related Links

vaisakham movie latest news
Vaisakham 40 days completed
DJ Vvasant is a good name with VaisakhamComments

FOLLOW
 TOLLYWOOD