బిచ్చగాడు లా హిట్ కొడతాడా
TOLLYWOOD
 TOPSTORY

బిచ్చగాడు లా హిట్ కొడతాడా

Murali R | Published:February 24, 2017, 12:00 AM IST
బిచ్చగాడు తెలుగులో సూపర్ హిట్ కావడంతో విజయ్ ఆంటోనీ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది దాంతో అతడి ప్రతీ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది . బిచ్చగాడు తర్వాత వచ్చిన బేతాళుడు అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు కానీ విజయ్ ఆంటోనీ కి ఉన్న క్రేజ్ తో మంచి వసూళ్ల ని సాధించింది . దాని తర్వాత వస్తున్న చిత్రం '' యమన్ '' . తెలుగు , తమిళంలో ఏకకాలంలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఈరోజు భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన యమం చిత్రంపై విజయ్ ఆంటోనీ చాలా ఆశలు పెట్టుకున్నాడు .
 
 

మొదటి నుండి కూడా విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటున్న విజయ్ ఆంటోనీ ప్రస్తుతం యమన్ తో బిచ్చగాడు లాంటి హిట్ కొడతానని ధీమాగా ఉన్నాడు . ఒకవేళ పెద్ద హిట్ కొడితే తెలుగులో మరింత స్ట్రాంగ్ మార్కెట్ ఏర్పడుతుంది విజయ్ ఆంటోనీ కి . మరి బిచ్చగాడు లాంటి హిట్ కొడతాడా? లేదా ? అనేది తెలియాలంటే కొద్దీ గంటలు వెయిట్ చేయాల్సిందే . 
Comments

FOLLOW
 TOLLYWOOD