బిచ్చగాడు హీరోకు భలే డిమాండ్
TOLLYWOOD
 TOPSTORY

బిచ్చగాడు హీరోకు భలే డిమాండ్

Murali R | Published:November 14, 2017, 9:57 AM IST
బిచ్చగాడు చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన హీరో విజయ్ ఆంటోనీ కి ఆ సినిమా తర్వాత భలే డిమాండ్ ఏర్పడింది . తాజాగా సీనియర్ హీరోయిన్ రాధికా తో కలిసి '' ఇంద్రసేన '' చిత్రాన్ని నిర్మించాడు కాగా ఆ సినిమా ఈనెల 30న రిలీజ్ కి సిద్ధమైంది అయితే నీలం కృష్ణారెడ్డి అనే నిర్మాత ఏకంగా రెండున్నర కోట్లు చెల్లించి థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు . బిచ్చగాడు హీరోకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇది పెద్ద మొత్తం కాదు కానీ విజయ్ ఆంటోనీ కి డబ్బుల కన్నా తన మార్కెట్ ని పెంచుకోవాలన్న ఆసక్తి ఎక్కువగా ఉంది అతడికి . 
 
 
 
అందుకే రెండున్నర కోట్ల కు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ హక్కులను అమ్మేశాడు అయితే ఓ మెలిక పెట్టాడట ! పబ్లిసిటీ మాత్రం ఎక్కడా తగ్గొద్దు అని ఖచ్చితంగా చెప్పాడట విజయ్ ఆంటోనీ . ఈనెల 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పట్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి , సినిమా హిట్ అయితే విజయ్ ఆంటోనీ కి స్థిరమైన మార్కెట్ ఏర్పడటం ఖాయం . ఇప్పటికే బేతాళుడు , యమన్  చిత్రాలతో తన సత్తా చాటాడు ఇక ఇప్పుడు ఇంద్రసేన అంటూ వస్తున్నాడు . Comments

FOLLOW
 TOLLYWOOD