విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఏంటో తెలుసా
TOLLYWOOD
 TOPSTORY

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఏంటో తెలుసా

Murali R | Published:October 19, 2017, 8:18 PM IST
ఇటీవలే అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ తాజాగా మరో సినిమాకు రెడీ అయ్యాడు . అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ నుండి వస్తున్నా కొత్త సినిమా ఏంటో తెలుసా  ........ .....'' ఏ మంత్రం వేసావే '' . శ్రీధర్ మర్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్ దేవరకొండ స్టిల్ బాగుంది . చూస్తుంటే ఈ సినిమా  కూడా యువత ని మాయ చేసేలా ఉంది . పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా హిట్ కొట్టి ఇండస్ట్రీ దృష్టి ని ఆకర్షించిన విజయ్ కి అర్జున్ రెడ్డి స్టార్ డం ని తెచ్చిపెట్టింది . 
 
 
ఏమంత్రం వేసావే సినిమాతో పాటుగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రంలో కూడా నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ . అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ పూర్తిగా మారిపోయింది . అతడికి తెలంగాణ స్లాంగ్ కూడా బాగా కలిసొచ్చింది . మొత్తానికి మరో రెండు హిట్ లు కొడితే మరింతగా అతడి రేంజ్ పెరగడం ఖాయం గా కనిపిస్తోంది .Comments

FOLLOW
 TOLLYWOOD