నాని శర్వానంద్ లకు విజయ్ దేవరకొండ పోటీ
TOLLYWOOD
 TOPSTORY

నాని శర్వానంద్ లకు విజయ్ దేవరకొండ పోటీ

Murali R | Published:September 7, 2017, 12:00 AM IST
గతకొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు నాని, శర్వానంద్ లు. అయితే రాబోయే కాలానికి కాబోయే స్టార్ లు వీళ్ళే అని అనుకుంటున్న సమయంలో యమా ఫాస్ట్ గా రేసులోకి దూసుకొచ్చాడు విజయ్ దేవరకొండ. తొలుత చిన్న చిన్న వేషాలు వేసిన విజయ్ కి ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం మంచి పేరు తీసుకురాగా పెళ్లి చూపులు చిత్రంతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ అదృష్టం పూర్తిగా మారిపోయింది.

ఇక ఇప్పుడేమో అర్జున్ రెడ్డి తో సరికొత్త సంచలనం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే విజయ్ తో సినిమాలు తీయడానికి పలువురు దర్శక నిర్మాతలు పోటీ పడుతుండగా అర్జున్ రెడ్డి ఘనవిజయం సాధించడం తో ఆ పోటీ మరీ ఎక్కువయ్యింది. ఇదే జోరు ముందు ముందు కొనసాగితే నాని , శర్వానంద్ లను కూడా దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. నాని , శర్వానంద్ లకు వరుస విజయాలు అంత తేలికగా దక్కలేదు ఎంతో హోమ్ వర్క్ చేశారు , ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు ఇప్పుడు రాటుదేలి అవలీలగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. కానీ విజయ్ దేవరకొండ కు మాత్రం పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. దాన్ని విజయ్ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి.

Related Links

Sharwanand Mahanubhavudu gets release Date
Vijay Devarakonda with Ramgopal Varma
Sanjay Leela Bhansali to remake Nanis Ninnu Kori


Comments

FOLLOW
 TOLLYWOOD