ఆ సినిమా ఒకరోజు వాయిదా పడింది
TOLLYWOOD
 TOPSTORY

ఆ సినిమా ఒకరోజు వాయిదా పడింది

Murali R | Published:October 16, 2017, 8:29 PM IST
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన చిత్రం '' మెర్సల్ ''. తెలుగులో అదిరింది పేరుతో డబ్ చేస్తున్నారు కాగా దీపావళి కానుకగా ఈనెల 18న సినిమాని రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ ఒకరోజు ఆలస్యంగా 19న రిలీజ్ చేస్తున్నారు . విజయ్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన ముగ్గురు అందమైన భామలు కాజల్ అగర్వాల్ , సమంత , నిత్యా మీనన్ లు నటిస్తున్నారు . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కింది.

తేరి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ - అట్లీ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . సినిమా సెన్సార్ మొత్తం పూర్తయినప్పటికీ జంతు సంరక్షణా సమితి నుండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడింది , అయితే ఒకరోజు ఆలస్యంగా 19న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.Comments

FOLLOW
 TOLLYWOOD